ఏయన్నార్ `గోపాల కృష్ణుడు`కి 40 ఏళ్ళు!
on Jul 1, 2022

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు కొన్ని రీమేక్ మూవీస్ లో సందడి చేశారు. అందులో `గోపాల కృష్ణుడు` చిత్రం ఒకటి. శివాజీ గణేశన్, సరిత, మేనక ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ సినిమా `కీళ్ వానమ్ శివక్కుమ్` (1981) ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి తెరకెక్కించారు. ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అతనికి జోడీగా జయసుధ, రాధ నటించగా జగ్గయ్య, అల్లు రామలింగయ్య, రమా ప్రభ, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, సుభాషిణి, హలం, అత్తిలి లక్ష్మి, డబ్బింగ్ జానకి ఇతర ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేశారు.
చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలకు వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యమందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గానం చేసిన గీతాల్లో.. ``అమ్మ చాటు పిల్లాడ్ని``, ``బంతులా చేమంతులా``, ``అందాల రాధిక``, ``జ్ఞాపకం ఉన్నదా``, ``గోదారి గట్టంట``, ``గుడి లోపలి దైవమా` - ఇలా అన్ని పాటలూ రంజింపజేశాయి. జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించిన `గోపాల కృష్ణుడు`.. 1982 జూలై 1న విడుదలైంది. కాగా, నేటితో ఈ చిత్రం 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



