తాప్సీ తొలి చిత్రం `ఝుమ్మంది నాదం`కి 12 ఏళ్ళు!
on Jul 1, 2022

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పలువురు నూతన కథానాయికలను తెలుగు తెరకు పరిచయం చేశారు. నేటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ తాప్సీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. `ఝుమ్మంది నాదం` పేరుతో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మ్యూజికల్ డ్రామాతో తాప్సీ తెరంగేట్రం చేసింది. ఇందులో సంప్రదాయ తెలుగు సంగీతంపై డాక్యుమెంటరీ తీయడానికి ఇండియాకి వచ్చే యన్.ఆర్.ఐ శ్రావ్యగా.. గ్లామర్, పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో ఎంటర్టైన్ చేసింది తాప్సీ. మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సుమన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, తనికెళ్ళ భరణి, సుధ, ఐశ్వర్య, ప్రగతి, వితికా షేరు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన `ఝుమ్మంది నాదం`కి వేదవ్యాస, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ సాహిత్యమందించారు. ``ఏం సక్కగున్నావ్ రో``, ``లాలి పాడుతున్నది``, ``సన్నాయి మోగింది``, ``దేశమంటే``, ``ఎంత ఎంత``, ``నిగ్రహం``, ``బాలమణి``, ``సరిగమపదని`` ``గోవింద హరిగోవింద`.. ఇలా ఇందులోని గీతాలన్ని రంజింపజేశాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మించిన `ఝుమ్మంది నాదం`.. 2010 జూలై 1న విడుదలైంది. అంటే.. నేటితో తాప్సీ నటప్రస్థానానికి 12 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



