`కూలీ నెం. 1`గా వెంకీ అలరించి నేటికి 31 ఏళ్ళు!
on Jul 12, 2022

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `కూలీ నెం.1`కి ప్రత్యేక స్థానముంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు జనరంజకంగా తీర్చిదిద్దారు. ప్రముఖ బాలీవుడ్ నటీమణి టబుకి తెలుగునాట ఇదే తొలి సినిమా కావడం విశేషం. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో శారద, రావు గోపాలరావు, మోహన్ బాబు, కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, డబ్బింగ్ జానకి, నిర్మలమ్మ, రాళ్ళపల్లి, గౌతంరాజు, రజిత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కథాంశం విషయానికి వస్తే.. పేదలంటే గిట్టని పెద్దింటి అమ్మాయి రంజిని (టబు)కి కూలీ అయిన రాజు (వెంకటేశ్) ఎలా గుణపాఠం చెప్పాడు? అసలు రంజిని గతమేంటి? అనే పాయింట్స్ చుట్టూ `కూలీ నెం. 1` తిరుగుతుంది.
ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. ``కొత్తగా కొత్తగా`` ``కలయా నిజమా`` ``దండాలయ్యా``, ``కిల కిల``, ``అటెన్షన్ ఎవ్రీబడి``, ``అబ్బనీ`` అంటూ మొదలయ్యే ఇందులోని గీతాలన్నీ రంజింపజేశాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన `కూలీ నెం.1`.. 1991 జూలై 12న విడుదలై ప్రజాదరణ పొందింది. కాగా, నేటితో ఈ మ్యూజికల్ హిట్ 31 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



