Home

»

Latest News

2022 ఫ‌స్టాఫ్ రివ్యూ11: సీనియ‌ర్ స్టార్స్ - మ‌ల్టిస్టార‌ర్స్!

Jun 30, 2022 3:30PM

2022 ఫ‌స్టాఫ్ లో ఒక్క న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మిన‌హా మిగిలిన సీనియ‌ర్ టాప్ స్టార్స్ అంతా తెర‌పై సంద‌డి చేశారు. విశేష‌మేమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేశ్ - ఇలా ఆ ముగ్గురు సీనియ‌ర్స్ కూడా మ‌ల్టిస్టార‌ర్స్ తోనే ప‌ల‌క‌రించారు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌న త‌న‌యుడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి `బంగార్రాజు`గా ఎంట‌ర్టైన్ చేశారు నాగార్జున‌. సంక్రాంతి స్పెష‌ల్ గా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ మ‌ల్టిస్టార‌ర్.. ఆ సీజ‌న్ లో విన్న‌ర్ గా నిలిచింది. నాగ్ కి చాన్నాళ్ళ త‌రువాత బాక్సాఫీస్ హిట్ ని అందించింది. ఇక చిరు విష‌యానికి వ‌స్తే.. నాగ్ లాగే కొడుకుతో క‌లిసి మ‌ల్టిస్టార‌ర్ చేశారు మెగాస్టార్. `ఆచార్య‌` పేరుతో రూపొందిన ఈ సినిమాలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి పోరాటాలు, నృత్యాల్లో పాలుపంచుకున్నారు చిరు. అయితే, భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 29న వ‌చ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిరాశ‌ప‌రిచింది.

అదే విధంగా, వెంక‌టేశ్ కూడా ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ఫ‌స్టాఫ్ లో మ‌ల్టిస్టార‌ర్ తోనే మురిపించారు. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందిన `ఎఫ్ 3` కోసం మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో క‌లిసి మ‌రోసారి జ‌ట్టుక‌ట్టారు. మే 27న విడుద‌లైన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించింది. మొత్త‌మ్మీద‌.. 2022 ఫ‌స్టాఫ్ లో చిరు, నాగ్, వెంకీ మ‌ల్టిస్టార‌ర్స్ లోనే క‌నిపించి వార్త‌ల్లో నిలిచారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com