2022 ఫస్టాఫ్ రివ్యూ 12: డీఎస్పీ, తమన్ హవా!
on Jun 30, 2022
ప్రస్తుతం తెలుగునాట హవా సాగిస్తున్న సంగీత దర్శకులంటే.. దేవి శ్రీ ప్రసాద్, తమన్ పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. 2022 ప్రథమార్ధంలోనూ ఈ ఇద్దరు వరుస చిత్రాలతో సందడి చేసి హవా చాటారు. జనవరిలో `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`, ఫిబ్రవరిలో `ఖిలాడి`, మార్చిలో `ఆడవాళ్ళు మీకు జోహర్లు`, మేలో `ఎఫ్ 3`తో డీఎస్పీ ఎంటర్టైన్ చేశాడు. ఇక తమన్ విషయానికి వస్తే.. జనవరిలో `సూపర్ మచ్చి`, ఫిబ్రవరిలో `డీజే టిల్లు` (నేపథ్య సంగీతం), `భీమ్లా నాయక్`, మార్చిలో `రాధే శ్యామ్` (నేపథ్య సంగీతం), ఏప్రిల్ లో `గని`, మేలో `సర్కారు వారి పాట`తో స్వరాల వర్షం కురిపించాడు. అంటే.. దేవి శ్రీ ఐదేసి సినిమాలతో పలకరించగా.. అరడజను చిత్రాలతో తమన్ సందడి చేశాడన్నమాట.
విజయాల సంగతికి వస్తే.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన చిత్రాల్లో `ఎఫ్ 3` మాత్రమే కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. తమన్ విషయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన `డీజే టిల్లు` బ్లాక్ బస్టర్ కాగా, `భీమ్లా నాయక్` - `సర్కారు వారి పాట` చెప్పుకోదగ్గ ఫలితం అందుకున్నాయి. మొత్తంగా.. 2022 ఫస్టాఫ్ లో సక్సెస్ పరంగా తమన్ నే ముందున్నాడన్నమాట.
Also Read