2021 జ్ఞాపకాలుః సత్తా చాటిన టాప్ స్టార్స్.. `స్టార్ ఆఫ్ ద ఇయర్` బాలయ్య!
on Dec 30, 2021

2021 క్యాలెండర్ ఇయర్.. టాలీవుడ్ టాప్ స్టార్స్ కి మెమరబుల్ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది వచ్చిన అగ్ర కథానాయకుల చిత్రాలేవీ డిజప్పాయింట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు.. స్టార్ హీరోల చిత్రాల్లో సింహభాగం సంచలనం సృష్టించాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బాలకృష్ణః
నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది చివరలో `అఖండ`తో సందడి చేశారు. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా.. బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇందులో అఘోరాగా నటవిశ్వరూపం చూపారు బాలకృష్ణ. అంతేకాదు.. కరోనా సెకండ్ వేవ్ అనంతరం పెద్ద సినిమాలకు ఊపిరి పోసిన ఘనత `అఖండ`దే. మరోవైపు.. ఓటీటీలోనూ మెస్మరైజ్ చేశారు బాలయ్య. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న టాక్ షో `అన్ స్టాపబుల్` బ్లాక్ బస్టర్ గా నిలిచి.. బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఓవరాల్ గా.. `స్టార్ ఆఫ్ ద ఇయర్` అనిపించుకున్నారు నటసింహం.
నాగార్జునః
కింగ్ నాగార్జున ఈ ఏడాది `వైల్డ్ డాగ్` చిత్రంతో పలకరించారు. బాక్సాఫీస్ ముంగిట ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు.. `బిగ్ బాస్ 5` వ్యాఖ్యాతగా ఎప్పటిలాగే తనదైన శైలితో రాణించారు నాగ్.
వెంకటేశ్ః
ఈ ఏడాది విక్టరీ వెంకటేశ్ కి ఎంతో ప్రత్యేకం. తను నటించిన `నారప్ప`, `దృశ్యం 2` చిత్రాలు.. ఓటీటీలోనే స్ట్రీమ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ రెండు రీమేక్స్ తో `ఓటీటీ స్టార్`గా సెన్సేషన్ క్రియేట్ చేశారు వెంకీ.
పవన్ కళ్యాణ్ః
`వకీల్ సాబ్`తో ఈ ఏడాది రి-ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి.. సదరు కోర్ట్ డ్రామా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆరంభ వసూళ్ళతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన `వకీల్ సాబ్`.. హిట్ లిస్ట్ లో చేరింది.
అల్లు అర్జున్ః
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్` ఈ ఏడాది చివరలో తెరపైకి వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళ వర్షం కురిపిస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం.. బన్నీకి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
రవితేజః
మాస్ మహారాజా రవితేజకి 2021 ఎంతో ప్రత్యేకం. `రాజా ది గ్రేట్`(2017) తరువాత సరైన విజయం లేని రవితేజకి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `క్రాక్` బ్లాక్ బస్టర్ ని అందించింది. అంతేకాదు.. 2021 క్యాలెండర్ ఇయర్ కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందించి వార్తల్లో నిలిచారు రవితేజ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



