థియేటర్లు ఓపెన్ చేసినా కొత్త సినిమాలు లేవు
on May 16, 2020

షూటింగ్స్ స్టార్ట్ చేసే విషయంలో, థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో ఇండస్ట్రీలో వివిధ అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడారు. ముందు షూటింగ్స్ స్టార్ట్ చేసి తర్వాత థియేటర్లు ఓపెన్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. షూటింగ్స్ మొదలయ్యాక థియేటర్లు తెరవడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
"కంటెంట్ రెడీ కాకుండా థియేటర్లు ఓపెన్ చేయడం కష్టం. ఐదారు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్న మాట నిజమే. అయితే, అవి మాత్రమే థియేటర్లకు సరిపోవు. ఇప్పుడు ఇండస్ట్రీలో రిలీజ్ కి రెడీగా ఉన్న కంటెంట్ తో నెల రోజులు థియేటర్లు నడవచ్చు. తర్వాత పరిస్థితి?" అని ఎన్వీ ప్రసాద్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వివరించారు. థియేటర్లు ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధిస్తుందో తెలియకుండా తొందపడి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన అన్నారు. ఎన్వీ ప్రసాద్ చెప్పినదానిబట్టి థియేటర్లు ఓపెన్ చేస్తే కొత్త సినిమాల కొరత ఏర్పడుతుంది అన్నమాట. లాక్ డౌన్ ఎత్తేశాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తీరిక సమయం దొరుకుతుంది కనుక ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలను వాళ్ల దృష్టికి తీసుకువెళితే బావుంటుందని పరిశ్రమ పెద్దలకు ఎన్వీ ప్రసాద్ సూచించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



