పాన్ ఇండియన్ ఫిలిమ్స్‌పై రామ్ దృష్టి
on May 16, 2020

'ఇస్మార్ శంకర్'గా యూత్ ఆడియెన్స్‌ను అమితంగా అలరించాడు రామ్ పోతినేని. దాంతో అతని తర్వాత సినిమా 'రెడ్' కోసం వాళ్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారమే అతను బర్త్‌డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలుగు నుంచి హిందీకి డబ్బింగ్ అయిన సినిమాల ద్వారా మన హీరోకు దేశవ్యాప్తంగా అభిమానులు తయారయ్యారు మరి! కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఏర్పడిన భయాందోళనల మధ్య తన బర్త్‌డేను ఎవరూ జరపవద్దని ఫ్యాన్స్‌కు రామ్ విజ్ఞప్తి చేశాడు.
'రెడ్' మూవీ తర్వాత ఇంతదాకా రామ్ మరో సినిమాకు సంతకం చేయలేదు. ఇటీవల తనకు తమిళం బాగా తెలుసనీ, ఆ భాషలో బాగా మాట్లాడగలననీ అతను తెలిపాడు. తమిళ దర్శకుల నుంచి తనకు ఆసక్తికరమైన ఆఫర్లు వస్తున్నాయని కూడా రామ్ చెప్పాడు. పాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి తాను సిద్ధమేనన్నాడు. ప్రస్తుతం తెలుగు నుంచి కొంతమంది స్టార్లు పాన్ ఇండియన్ ఫిలిమ్స్ చేస్తున్న నేపథ్యంలో రామ్ కూడా వాళ్ల సరసన చేరేట్లు కనిపిస్తున్నాడు.
'రెడ్' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అతను, ఆ పిమ్మటే తన తదుపరి సినిమాని డిసైడ్ చేయాలనుకుంటున్నాడు. 'రెడ్' మూవీలో నివేదా పేతురాజ్, మళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తమిళ హిట్ ఫిల్మ్ 'తాడమ్'కు రీమేక్. రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్న 'రెడ్'.. వాస్తవానికి ఏప్రిల్ 9న విడుదల కావాల్సింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ స్థితిలో విడుదల వాయిదాపడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



