'సీమ సింహం'లో బాలయ్య సందడి చేసి నేటికి 20 ఏళ్లు!
on Jan 11, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణకి టైటిల్ లో `సింహం`, `పోలీస్` వేషం, `సిమ్రాన్` జోడీ, `సంక్రాంతి` రిలీజ్, `మణిశర్మ` మ్యూజిక్.. ఇవన్నీ కూడా దాదాపుగా లక్కీ ఫ్యాక్టర్స్ అనే చెప్పాలి. ఇక వీటన్నింటికి వేదికగా నిలిచిన చిత్రంగా `సీమ సింహం`కి ప్రత్యేక స్థానముంది. `నరసింహనాయుడు` (2001) వంటి ఇండస్ట్రీ హిట్ రిలీజైన జనవరి 11ని టార్గెట్ చేసుకుని సరిగ్గా ఏడాది తరువాత వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. నందమూరి అభిమానులను అలరించింది. ఇందులో దుర్గా ప్రసాద్ అలియాస్ సింహ ప్రసాద్ గా బాలయ్య అభినయం సినిమాకే ఎస్సెట్ గా నిలిచింది.
రీమా సేన్ మరో నాయికగా నటించిన ఈ చిత్రంలో రఘువరన్, సుజాత, సాయికుమార్, కె. విశ్వనాథ్, పి. వాసు, చరణ్ రాజ్, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ళ భరణి, రావు రమేశ్(తొలి సినిమా), అన్నపూర్ణ, ఆనంద్ రాజ్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, గిరిబాబు, చలపతి రావు, రంగనాథ్, మోహన్ రాజ్, వెన్నిరాడై నిర్మల, సంగీత, ఎల్బీ శ్రీరామ్, సత్యప్రకాశ్, రజిత, శివపార్వతి, వర్ష, కల్పనా రాయ్, మాస్టర్ ఆనంద్ వర్ధన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. `చిరునవ్వుతో` ఫేమ్ జి. రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, జె. భగవాన్ నిర్మించారు.
Also Read: `ఖిలాడి` టు `రావణాసుర`.. రవితేజ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ!
మణిశర్మ స్వరకల్పనలో ``చందమామ చందమామ``, ``అవ్వా బువ్వా``, ``పోరి హుషారుగుందిరో``, ``మంచితనం ఇంటిపేరు``, ``రెండు జళ్ళ పాప``, ``కోకా రైక``.. ఇలా అన్నీ పాటలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా 2002 జనవరి 11న విడుదలైన `సీమ సింహం`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



