మెగాస్టార్ `ఖైదీ నంబర్ 150`కి ఐదేళ్ళు!
on Jan 11, 2022

మెగాస్టార్ చిరంజీవికి టైటిల్ లో `ఖైదీ` ఉంటే సక్సెస్ పక్కా అన్నది విశ్లేషకుల మాట. కెరీర్ ఆరంభంలో చేసిన `ఖైదీ` (1983) చిరు నటజీవితాన్నే మేలిమలుపు తిప్పితే.. స్టార్ గా ఎదిగాక చేసిన `ఖైదీ నంబర్ 786` (1988) మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ పై హీరోయిజానికి దాదాపు పదేళ్ళు దూరమైన చిరు.. `ఖైదీ నంబర్ 150` (2017)తో `బాస్ ఈజ్ బ్యాక్` అంటూ మెగా రి-ఎంట్రీ ఇస్తే అది కాస్త తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలా.. టాలీవుడ్ వెండితెర `ఖైదీ`గా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు చిరు.
ఇక సంక్రాంతి స్పెషల్ గా 2017 జనవరి 11న జనం ముందు నిలిచిన `ఖైదీ నంబర్ 150`.. నేటితో ఐదేళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్రం తాలూకు కొన్ని ఆసక్తికరమైన విశేషాల్లోకి వెళితే..
Also Read: మూడు రోజుల్లో చనిపోతాననుకున్నా!
* `ఠాగూర్` (2003) వంటి సంచలన విజయం తరువాత వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన సినిమా ఇది. `ఠాగూర్` లాగే `ఖైదీ నంబర్ 150` కూడా తమిళ సినిమాకి రీమేక్ నే కావడం విశేషం. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన `రమణ` ఆధారంగా `ఠాగూర్` తెరకెక్కితే.. అదే మురుగదాస్ రూపొందించిన `కత్తి`కి తెలుగు వెర్షన్ గా `ఖైదీ నంబర్ 150`ని తీర్చిదిద్దారు వినయ్.
* `మగధీర`, `నాయక్`, `గోవిందుడు అందరి వాడేలే` చిత్రాలతో చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి హిట్ పెయిర్ గా నిలిచిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇందులో మెగాస్టార్ కి జంటగా తొలిసారిగా కనువిందు చేసింది. త్వరలో రిలీజ్ కానున్న `ఆచార్య`లో కూడా తనే చిరుకి జోడీ.
* రామ్ చరణ్ ఈ సినిమాతోనే నిర్మాతగా మారారు. అంతేకాదు.. ఇందులోని చార్ట్ బస్టర్ సాంగ్ ``అమ్మడు లెట్స్ డు కుమ్ముడు`` కోసం కాసేపు చిరుతో కలిసి చిందులేశారు. ఆపై చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా.. నరసింహారెడ్డి` (2019)ని కూడా నిర్మించి వార్తల్లో నిలిచారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



