'తులసి'గా వెంకటేష్ అలరించి నేటికి 15 ఏళ్ళు
on Oct 12, 2022

విక్టరీ వెంకటేష్ నటించిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ లో 'తులసి'(2007) ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. లక్ష్మీ(2006), 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'(2007) చిత్రాలతో వరుస విజయాలు అందుకొని జోరు మీదున్న వెంకటేష్ 'తులసి'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ అందుకున్నాడు. 12 అక్టోబర్ 2007 విడుదలైన ఈ చిత్రం నేటితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
2005 లో వచ్చిన 'భద్ర'తో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా 'తులసి'. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పర్వతనేని తులసి రామ్ పాత్రలో ఓ వైపు హాస్యం, మరోవైపు రౌద్రం ప్రదర్శిస్తూ చెలరేగిపోయి నటించాడు వెంకటేష్. ఈ చిత్రంలో కామెడీ ఎంతలా ఆకట్టుకుందో ఫైట్స్ కూడా అదే స్థాయిలో మెప్పించాయి. ముఖ్యంగా లోకల్ ఎలక్షన్స్ టైంలో తన తండ్రిని అవమానించిన వారిపై తులసి తిరగబడే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే వెంకటేష్-నయనతార మధ్య సన్నివేశాలు అలరించాయి.

సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడీగా నయనతార నటించంగా.. రమ్య కృష్ణ, శివాజీ, ఆలీ, రాహుల్ దేవ్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా మ్యూజికల్ గానూ పెద్ద హిట్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఆయన స్వరపరిచిన అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'వెన్నెలింత వేడిగా', 'తుల తుల తులసి', 'నీ కళ్ళతోటి', 'నే చుక్ చుక్ బండినిరో' పాటలు విశేష ఆదరణ పొందాయి. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి సంభాషణలు రాశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



