అనసూయనా మజాకానా..న్యూయార్క్ మేయర్ తో ‘తగ్గేదేలే’
on Oct 12, 2022

"పుష్ప" మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ మూవీ వచ్చి వన్ ఇయర్ ఐపోయింది. కానీ దాని క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. పుష్పరాజ్ మేనరిజం, డైలాగ్స్, పాటలు ఫంక్షన్స్ లో, స్కిట్స్ లో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఐతే రీసెంట్ ఒక విషయాన్ని గమనిస్తే దసరా పండగ సందర్భంగా న్యూయార్క్ లో తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి న్యూయార్క్ సిటీ మేయర్ "ఎరిక్ ఆడమ్స్" హాజరయ్యారు. ఇక ఇదే ప్రోగ్రాంకి అనసూయ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఈ ప్రోగ్రాం పూర్తయ్యాక అనసూయ మేయర్ తో కలిసి ‘పుష్ఫ’లోని ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ను చెప్పించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఆ వీడియోను "న్యూయార్క్ మేయర్ ఆఫీస్ టీం" వాళ్ళు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోపై పుష్ఫ టీం స్పందిస్తూ "ఇండియన్ సినిమాపై మేయర్ చూపించిన ప్రేమకు ధన్యవాదాలు" అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. అలాగే అక్కడ దసరా ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీకి విషెస్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



