`అన్నవరం`గా పవన్ అలరించి నేటికి 15 ఏళ్ళు!
on Dec 29, 2021

తెలుగునాట రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అలా పవన్ ఎంటర్టైన్ చేసిన రీమేక్ మూవీస్ లో `అన్నవరం` ఒకటి. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `తిరుప్పాచ్చి` (విజయ్, త్రిష, మల్లిక) ఆధారంగా రూపొందిన ఈ సిస్టర్ సెంటిమెంట్ యాక్షన్ డ్రామాలో పవన్ కి జంటగా అసిన్ నటించగా, చెల్లెలిగా `ప్రేమిస్తే` ఫేమ్ సంధ్య దర్శనమిచ్చింది. శివబాలాజీ, ఆశిష్ విద్యార్ధి, వేణు మాధవ్, లాల్, నాగబాబు, బ్రహ్మానందం, భార్గవి, బ్రహ్మాజీ, సునీల్, తెలంగాణ శకుంతల, హేమ, తనికెళ్ళ భరణి, మల్లికార్జునరావు, రఘుబాబు, సుమన్ శెట్టి, రంగనాథ్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఉత్తేజ్, ఎల్బీ శ్రీరామ్, లక్ష్మీపతి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. `సుస్వాగతం` (1998) వంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు - పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.
రమణ గోగుల బాణీలు అందించిన ఈ చిత్రంలో ``నీవల్లే నీవల్లే``, ``అన్నయ్యా అన్నావంటే`` పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``రాక్షస రాజ్యం`, ``లూసియా``, ``జర్ర సూడు``, `ఆ దేవుడు నా కోసం`` గీతాలు కూడా రంజింపజేశాయి. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. 2006 డిసెంబర్ 29న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `అన్నవరం`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



