కార్తి.. నాలుగోసారి!
on Dec 29, 2021

పేరుకి తమిళ కథానాయకుడైనా.. తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ కార్తి. అంతేకాదు.. అన్న సూర్య తరహాలోనే వైవిధ్యభరిత పాత్రలకు చిరునామాగా నిలుస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే కార్తి తన 14 ఏళ్ళ కెరీర్ లో కేవలం 20 చిత్రాల్లో మాత్రమే కథానాయకుడిగా నటించాడు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. కాగా, 2022లో ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు కార్తి. ఆ చిత్రాలే.. `పొన్నియన్ సెల్వన్ - పార్ట్ 1`, `విరుమాన్`, `సర్దార్`. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో `పొన్నియన్ సెల్వన్` తెరకెక్కగా, ఎం. ముత్తయ్య డైరెక్షన్ లో `విరుమాన్` రూపొందింది. `అభిమన్యుడు` ఫేమ్ పి.ఎస్. మిత్రన్ నిర్దేశకత్వంలో `సర్దార్` తయారవుతోంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ మూడు చిత్రాలతో కార్తి ఎలాంటి ఫలితాలను పొందుతాడో చూడాలి.
కాగా, గతంలో 2010, 2013, 2019 సంవత్సరాల్లోనూ మూడేసి చిత్రాలతో సందడి చేశాడు కార్తి. కట్ చేస్తే.. 2022లో నాలుగోసారి ఆ శైలిని కొనసాగించబోతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



