14 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లరి కుర్రోడు..!
on May 10, 2016

2002 మే 10న అల్లరి నరేష్ తెలుగు సినీ రంగానికి అల్లరి సినిమాతో పరిచయమయ్యాడు. నేటికి కరెక్ట్ గా పద్నాలుగేళ్లు. రవిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ సాధించడంతో, మొదటి సినిమాలోనే కామెడీ హీరోగా మంచి పునాది వేసుకున్నాడు ఈదర నరేష్. తర్వాత వరస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయనంత స్పీడ్ తో సినిమాలు చేసేశాడు. కేవలం ఈ పద్నాలుగేళ్ల వ్యవధిలోనే 50 పైచిలుకు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. బహుశా ఇంత సినిమా కౌంట్ కేవలం నరేష్ కు మాత్రమే ఉన్నట్టుంది. ఇక తన ట్విట్టర్లో " 14 ఏళ్ల క్రితం అల్లరితో తెలుగు ఇండస్ట్రీలో ప్రయాణం స్టార్ అయింది. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది " అంటూ ట్వీటాడు అల్లరోడు. కామెడీ హీరోగానే కాక, సైడ్ హీరోగా కూడా గమ్యం, శంభో శివ శంభో లాంటి సినిమాల్లో మంచి పెర్ఫామెన్స్ కనబర్చాడు అల్లరి నరేష్. గత కొంతకాలంగా సక్సెస్ లేక స్లో అయిన నరేష్, మళ్లీ స్పీడందుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం జి నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో మా ఇంట్లో దెయ్యం, నాకెందుకు భయం అనే సినిమాను చేయబోతున్నాడు. అల్లరి నరేష్ మళ్లీ పాత ఫామ్ లోకి రావాలని, వరస సినిమాలతో దూసుకుపోవాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



