కేటీఆర్‌ను థియేటర్‌కు రప్పించిన సూర్య
on May 11, 2016
.jpg)
మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 24 సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమాలో త్రిపాత్రాభినయంలో నటించిన సూర్య విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎప్పుడూ ఊపిరి సలపనంత బిజీగా ఉండే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిన్న సాయంత్రం తన కుటుంబసభ్యులతో కలిసి 24 సినిమాను చూశారు. అనంతరం సినిమాపైనా, సూర్య నటనపైనా తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడే 24 సినిమాను చూశాను. బ్రిలియంట్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన పర్ఫామెన్స్..తనకు ఎంతో నచ్చిందన్నార. తన పిల్లలిద్దరూ టైం ట్రావెల్ వాచ్ కావాలని అడుగుతున్నారంటూ ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



