ప్రియాంకకు బాలీవుడ్ గుర్తుందట..!
on May 10, 2016
.jpg)
ఒకప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం కూడా కష్టపడిన ప్రియాంక చోప్రా, నేడు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. హాలీవుడ్ లో బేవాచ్ సినిమాతో పాటు, క్వాంటికీ టీవీ సీరీస్ తో దుమ్ములేపుతున్న ఈ భామ, అక్కడకు వెళ్లిన తర్వాత, మళ్లీ ఇక్కడ సినిమాలేవీ ఒప్పుకోలేదు. దాంతో మేడమ్ గారు పూర్తిగా ఇంగ్లీషోళ్ల సినిమాలకే పరిమితమైపోతారనే టాక్ వచ్చింది. అయితే ఆ వార్తల్ని పీసీ ఖండించింది. బాలీవుడ్ ను తాను వదిలే ప్రసక్తే లేదని, కొన్ని నెలల నుంచి హాలీవుడ్ లో బిజీగా ఉండటం వలనే ఇక్కడ కథలు వినే తీరిక కూడా దొరకలేదని చెప్పుకొచ్చింది. త్వరలోనే తన హిందీ సినిమా డిటెయిల్స్ ను వెల్లడిస్తానని, కథలు ఈ మధ్యే కొన్ని విన్నా, ఏ కథ ఒప్పుకోవాలో తెలియట్లేదని చెబుతోంది. ప్రియాంక అభిమానులు మాత్రం, ఏదొకటి ఒప్పుకుని మళ్లీ మన సినిమా మీద కనిపిస్తే చాలులే అంటున్నారు. త్వరలోనే హాలీవుడ్ అస్సైన్ మెంట్స్ ముగించుకుని, బాలీవుడ్ లో కొత్త సినిమా మొదలెట్టబోతోందట ప్రియాంక. ఆమె చివరిగా ఇక్కడ చేసిన జై గంగాజల్ ఫ్లాపయ్యింది. మరి నెక్స్ట్ సినిమా ఎలాంటిది ఎంచుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



