`బద్రినాథ్`గా అల్లు అర్జున్ అలరించి నేటికి 11 ఏళ్ళు!
on Jun 10, 2022

`బన్ని` (2005) వంటి విజయవంతమైన చిత్రం తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా `బద్రినాథ్` (2011). చిన్ని కృష్ణ రచన చేసిన ఈ చిత్రంలో బన్నీకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంటర్టైన్ చేసింది. ప్రకాశ్ రాజ్, కెల్లీ దోర్జీ, అశ్విని కల్సేఖర్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ప్రగతి, కోవై సరళ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్, మాస్టర్ భరత్, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్, రఘుబాబు, సుధ, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
బద్రినాథ్ ఆలయానికి రక్షకుడిగా ఉండే బద్రినాథ్ (అల్లు అర్జున్) అనే ఓ యువ యోధుడు.. అనూహ్య పరిణామాల నడుమ అలకనంద (తమన్నా) ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
స్వరవాణి కీరవాణి బాణీలు, నేపథ్య సంగీతం `బద్రినాథ్`కి ప్రధాన బలంగా నిలిచాయి. ఇందులోని ``నాథ్ నాథ్``, ``చిరంజీవ``, ``నచ్చావురా``, ``వసుధార``, ``ఓంకారేశ్వరి``, ``అంబదరి`` అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన `బద్రినాథ్`.. `బెస్ట్ ఆడియోగ్రాఫర్` (కె. దేవీకృష్ణ) విభాగంలో `నంది` పురస్కారం, `బెస్ట్ కొరియోగ్రాఫర్` (ప్రేమ్ రక్షిత్ - ``నాథ్ నాథ్``) విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డును అందుకుంది. 2011 జూన్ 10న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `బద్రినాథ్`.. నేటితో 11 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



