చిరంజీవి `ఖైదీ నంబర్ 786`కి 34 ఏళ్ళు!
on Jun 10, 2022

మెగాస్టార్ చిరంజీవి - అగ్ర దర్శకుడు విజయ బాపినీడుది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో `ఖైదీ నంబర్ 786` ఒకటి. తమిళంలో ఘనవిజయం సాధించిన `అమ్మన్ కోవిల్ కీళక్కాలే` (విజయకాంత్, రాధ) ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో చిరంజీవికి జంటగా భానుప్రియ నటించగా మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, పద్మనాభం, పీజే శర్మ, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సిల్క్ స్మిత ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
రాజ్ - కోటి స్వరకల్పనలో రూపొందిన పాటలకు వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర సాహిత్యమందించారు. ``గువ్వా గోరింకతో``, ``అటు అమలాపురం`` అంటూ సాగే గీతాలు సంచలనం సృష్టించగా.. ``రైటో అటో ఇటో``, ``చలిగాలి కొట్టిందమ్మా``, ``గుండమ్మ బండి దిగి`` కూడా రంజింపజేశాయి. ఈ పాటలన్నింటిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి గానం చేశారు. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన `ఖైదీ నంబర్ 786`.. 1988 జూన్ 10న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 34 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



