`నారప్ప`.. టీజర్ కి వేళయిందప్ప!
on Jun 24, 2021
`నారప్ప`.. విక్టరీ వెంకటేశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `అసురన్` ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో
దర్శనమివ్వనున్నారు వెంకి. కరోనా రెండో దశ ఉధృతికి ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. మరో వారం రోజుల్లో `నారప్ప` టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు.. వెంకీ అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఇందులో పొందుపరిచారని టాక్. త్వరలోనే `నారప్ప` టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `నారప్ప`లో వెంకటేశ్ కి జంటగా ప్రియమణి నటించగా ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ, కార్తిక్ రత్నం, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. డి. సురేశ్
బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. మరి.. `అసురన్` తరహాలో `నారప్ప` కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి.