సినిమాల్లోకి రావాలనుకునే వారికి అద్భుతమైన ప్లాట్ఫామ్ 'దిల్ రాజు డ్రీమ్స్'
on Jun 29, 2025
"సినీ పరిశ్రమలోకి రావాలని ఎందరికో ఉంటుంది. కానీ, వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ ని లాంచ్ చేస్తున్నాం" అన్నారు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేశారు.
దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్ రాజు డ్రీమ్స్ ని దిల్ రాజు గారికి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక హోప్ ని ఇచ్చింది. ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్సైట్ లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే. దిల్ రాజు గారు 14 మంది డైరెక్టర్స్ ని లాంచ్ చేశారు. ఈ వేదిక ద్వారా నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ని లాంచ్ చేయబోతున్నారు. ఐదేళ్ల తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు ఇలా స్టేజ్ మీద నిలబడి దిల్ రాజు డ్రీమ్స్ రా తమ డ్రీమ్ ని నెరవేర్చుకున్నామని చెప్తే చాలా ఆనంద పడతాను. ఇంత అద్భుతమైన ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసిన దిల్ రాజు గారికి అభినందనలు." అన్నారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. "ఒక క్రియేషన్ ఒకరి కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసేవారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే మన పక్కనున్న వాళ్ళు మనల్ని నిరుత్సాహ పరిస్తే మనలో ఒక ఫైర్ రావాలి. ఎంతమంది నిరుత్సాహపరిచినా మీ కలని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూనే వెళ్ళండి. ఎవరు ఆపలేరు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, విజయ్ దేవరకొండ.. మన కలని మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రాజుగారంటే మాకు ఫ్యామిలీ. ఆయన నాకు పెద్దన్నయ్య లాంటివారు. దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక అద్భుతమైన వేదిక. యాక్టర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా ఒక కాలమ్ కేటాయించడం గొప్ప విషయం. ఇలాంటి వెబ్సైట్ నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు. గొప్ప ప్రొడక్షన్ హౌస్ ఈ వెబ్సైట్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీ అందరికీ ఒక గొప్ప ఫ్లాట్ ఫామ్. సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్ గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే లైఫ్లో డల్ మూమెంట్ అనేది ఉండదు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్" అన్నారు
దిల్ రాజు మాట్లాడుతూ.. "శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ సినిమా తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని లాంచ్ చేసాం. వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 57 సినిమాలు పూర్తయ్యాయి. నేను శిరీష్ కథ విని బాగుందన్న తర్వాతనే స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అలానే 57 సినిమాలు పూర్తి చేశాం. హర్షిత్ హన్సిత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి బలగం వేణు తో పాటు నలుగురు కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు. వాళ్లు కూడా కొత్త దర్శకులతో అన్ని రకాల సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచన ఈ దిల్ రాజు డ్రీమ్స్. దీనిని ఒక యంగ్ జనరేషన్ టీం తో ఫామ్ చేసాము. దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా మేము ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దీనికి మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. దానిలో టీమ్ స్క్రూటినీ చేసి మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత మా దగ్గర పంపిస్తారు. మేము టైం స్పెండ్ చేసి దాన్ని ఓకే చేస్తాము. కానీ చాలామంది రిజెక్ట్ అవ్వచ్చు. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మీలో కాన్ఫిడెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దిల్ రాజు డ్రీమ్స్ లో ఒక ప్రొడ్యూసర్ కాలమ్ కూడా పెడుతున్నాం. సినిమా గురించి మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మోసాలు ఉంటాయి. అన్నిటి మీద అవగాహనతో ముందుకు రావాలి. ఈవెంట్ కి రావడానికి పదివేల రిజిస్ట్రేషన్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా లక్ష నుంచి రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ ప్లాట్ ఫామ్ ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్." అన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
