కన్నప్ప పై ఎవరు ఊహించని కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. అసలు ఆ మాటలేంటి!
on Jun 28, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)ప్రస్తుతం 'కన్నప్ప'(Kannappa)గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. తిన్నడు అనే ఒక ఆటవిక మనిషి శ్రీ కాళ హస్తీశ్వరుడి పరమ భక్తుడైన 'కన్నప్ప' గా ఎలా మారాడనే కధాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. కన్నప్ప క్యారక్టర్ లో విష్ణు ప్రదర్శించిన నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నాడు.
ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కన్నప్ప చిత్రంపై తన అభిప్రాయాన్ని విష్ణుకి వాట్స్ అప్ రూపంలో పంపించాడు. సదరు వాట్స్ అప్ లో ' తిన్నడుగా నువ్వు కేవలం నటించలేదు. ఆలయమంతా భక్తి, విశ్వాసం మూర్తిభివించిన వ్యక్తిలా కనిపించావు. కొన్ని సన్నివేశాల్లో నీ నటన నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. క్లైమాక్స్ లో శివలింగం నుంచి రక్తం కారుతుంటే నీ రెండు కళ్ళని సమర్పించే సమయంలో నీ నటన పతాక స్థాయిలో ఉంది. ఆ సమయంలో నువ్వు పలికించిన హావభావాలు, భావోద్వేగ సన్నివేశాలకి చేతులెత్తి నమస్కరించాలి. అందరు ప్రభాస్ కోసం మూవీకి వెళ్తున్నామని అంటున్నారు. కానీ నిన్ను చూడటానికే టికెట్ కొని మరి థియేటర్ కి వెళ్తున్నాను. నాకు మొదటి నుంచి దేవుడు,భక్తి అంటే నమ్మకం లేదు. అందుకే మొదటి నుంచి నేను అలాంటి సినిమాలు చూడలేదు. కానీ నా కాలేజీ రోజుల్లో భక్త కన్నప్ప ని నటి నటులు సాంగ్స్ కోసం నాలుగు సార్లు చూసాననే సందేశాన్ని పంపాడు. ఈ వాట్స్ అప్ తాలూకు స్క్రీన్ షాట్ ని విష్ణు సామిజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసాడు.
ఇక కన్నప్ప మొదటి రోజు ఇరవై కోట్ల రూపాయలని కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్(Prabhas)అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషించగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకత్వం వహించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
