హరి హర వీరమల్లు.. ట్రైలర్ కాపాడుతుందా..?
on Jun 29, 2025
.webp)
తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. ఆయన సినిమా వస్తే చాలు.. చూడాలనుకునేవారు ఎందరో ఉన్నారు. అయితే పవర్ స్టార్ అప్ కమింగ్ మూవీ 'హరి హర వీరమల్లు' పరిస్థితి మాత్రం భిన్నమైనది. (Hari Hara Veera Mallu)
'హరి హర వీరమల్లు' ఎప్పుడో ఐదేళ్ళ క్రితం మొదలైంది. కరోనా పాండమిక్, పవన్ పాలిటిక్స్ తో బిజీ వంటి కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో ఎన్నో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం మొదలై, ఇప్పటికే పలుసార్లు వాయిదా పడటంతో.. పవన్ కళ్యాణ్ అభిమానులు 'వీరమల్లు' కంటే కూడా ఆ తర్వాత రానున్న 'ఓజీ'పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ దృష్టిని పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలంటే.. వీరమల్లు టీం చేతిలో ఒకే ఒక ఆయుధం ఉంది. అదే ట్రైలర్. (HHVM Trailer)
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ను జూలై 3న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని భుజానికెత్తుకుంటారు అనడంలో సందేహం లేదు. వీరమల్లు ట్రైలర్ కట్ అదిరిపోయిందని, ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు. అదే జరిగితే 'హరి హర వీరమల్లు' సినిమా పవన్ కళ్యాణ్ స్టార్డంకి తగ్గ భారీ ఓపెనింగ్స్ ని రాబడుతుంది. కాగా, వీరమల్లు చిత్రం జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



