ENGLISH | TELUGU  
Home  » Gossips

వర్మ బెజవాడ రౌడీలులో వంగవీటి రంగ ఎవరు

on Mar 29, 2011

naga chaitanya wallpapers, naga chaitanya stills, naga chaitanya pics, naga chaitanya images, naga chaitanya photos, naga chaitanya picturesరామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న "బెజవాడ రౌడీలు" చిత్రంలో వంగవీటి మోహన రంగా పాత్రను ఎవరు పోషిస్తారు...? అలాగే దేవినేని నెహ్రూ పాత్రను ఏవరు పోషిస్తారు...? అన్న ప్రశ్నలకు విజయవాడలో ఒక సామాజిక వర్గంలో ఘాటైన చర్చ జరుగుతోంది. ఒకవేళ తమ సామాజిక వర్గానికి చెందని నాగచైతన్య గనక వంగవీటి రంగా పాత్ర పోషిస్తే అది తమకు అవమానమని ఆ సామాజిక వర్గం భావిస్తోందట. విజయవాడలో వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ ఇద్దరూ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు. వీరిద్దరి మధ్య గ్యాంగ్ వార్ జరుగుతూండేది. ఆ క్రమంలో రాధా, ఆ తర్వాత దేవినేని మురళి, ఆ తర్వాత రంగా హత్యచేయబడ్డారు.

 

వర్మ"బెజవాడ రౌడీలు" అనే పేరు మీద చిత్రం నిర్మిస్తే ఈ రెండు వర్గాల గురించి తప్పక చర్చించాల్సి వస్తుంది. అలాగే ఈ చిత్రంలో రంగా పాత్రలో నటించాల్సిందిగా యువ హీరో రామ్ చరణ్ ని కోరాలని ఆ సామాజిక వర్గం భావిస్తూందట. ఇందుకు రామ్ చరణ్ అంగీకరించేలా మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి చేత వత్తిడి చేసేలా ప్రయత్నించాలని కూడా ఆ సామాజిక వర్గం భావిస్తోందట. అసలు వర్మ "బెజవాడ రౌడీలు" ఇంకా మొదలు కాక ముందు నుంచే ఈ కులాల కుమ్ములాటలు మొదలైతే, ఈ వర్మ "బెజవాడ రౌడీలు" సినిమా విడుదలైతే విజయవాడ రావణ కాష్టమవుతుందనటంలో సందేహం లేదు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.