Home

»

Latest News

అఖిల్‌కి హిట్టివ్వలేదు! చైతూకి ఇస్తారా?

Mar 2, 2020 4:30PM

 

అక్కినిని కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌. తర్వాత అఖిల్‌తో సినిమా చేసినా... ఆశించిన విజయం దక్కలేదు. మరి, చైతూకి హిట్టిస్తారో? లేదో? చూడాలి. 

అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుపెట్టుకునే హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’. అందులో కుమారుడు నాగార్జున, పెద్ద మనవడు నాగచైతన్యతో కలిసి నటించారు. మరో మనవడు అఖిల్‌ చిన్న అతిథి పాత్రలో కనిపించారు. సంక్లిష్టమైన కథ, కథనాలతో వినోదాన్ని ఎక్కడా విడవకుండా చక్కటి కుటుంబకథా చిత్రంగా ‘మనం’ని విక్రమ్‌ తీర్చిదిద్దాడు. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌ పరాజయాల్లో విక్రమ్‌ని పిలిచి సినిమా చేయమన్నారు. ‘హలో’ చేశారు. కానీ, హిట్‌ అవ్వలేదు. ఆ తర్వాత రెండేళ్లకు విక్రమ్‌కుమార్‌ నానితో ‘గ్యాంగ్‌ లీడర్‌’ చేశాడు. అదీ హిట్‌ కాలేదు. ఇప్పుడు నాగచైతన్యతో అతడు సినిమా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇండస్ట్రీ టాక్‌.

నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించడానికి ‘దిల్‌’ రాజు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ బీవీఎస్‌ రవి స్టోరీ ఇస్తున్నార్ట. ప్రస్తుతం చర్చల దశలో ఉంది. దర్శకుడిగా విక్రమ్‌ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఫ్లాప్‌ సినిమాల్లో కూడా టాలెంట్‌ చూపించిన సీన్లు ఉంటాయి. స్టోరీ పరంగా కొన్ని మిస్టేక్స్‌ చేయడంతో రిజల్ట్స్‌ తేడాగా వచ్చాయి. కరెక్టు కథ కుదిరితే సాలిడ్‌ హిట్‌ ఇవ్వగలడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com