తాప్సీ కాళ్ల కింద కెమెరా పెట్టినప్పుడు నోరు విప్పలేదే..
on Apr 4, 2017
నటకిరిటీ రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడిస్ టైలర్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పక్లర్లేదు. ఇన్నాళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ చేయ్యాలని డిసైడ్ అయ్యాడు వంశీ. దీనిలో భాగంగా సుమంత్ అశ్విన్ హీరోగా ఫ్యాషన్ డిజైనర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఫ్రీలుక్ పోస్టర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మాయి కొలతలు టేపుతో కొలుస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
"మనం అమ్మాయిలని ఇలా చూపించడం ఎప్పుడు మానేస్తాం అంటూ" మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు..దీనికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మద్దతు పలికింది. కాని నెటిజన్స్ మాత్రం లక్ష్మీపై ఫైర్ అవుతున్నారు..మీ ఫ్యామిలీ నిర్మించిన ఝుమ్మందినాదం సినిమాలో తాప్సీ కాళ్లకింద కెమెరాని చూపించినప్పుడు, గుండెల్లో గోదారిలో తాప్సీ ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడని నువ్వు ఇప్పడు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉంది.. ముందు నీ కుటుంబ సభ్యుల సినిమాలపై నోరెత్తలేదు కానీ..బయట వారి సినిమాలపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.