ఆ సర్జరీయే బన్నీ కొంపముంచిందా..?
on Apr 4, 2017
.jpg)
హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. హరీశ్ శంకర్ మంచి కసితో సినిమా చేస్తుండటంతో పాటు బన్నీ తనకు బాగా అచ్చొచ్చిన సమ్మర్‌లో మూవీ రిలీజ్ చేస్తుండటంతో అందరి కళ్లు డీజే పైనే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ సమ్మర్ బరిలోంచి తప్పుకుంటున్నాడు అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.
చోటా మోటా హీరోల నుంచి స్టార్ హీరోలదాకా ఉగాదికి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు..కాని డీజే టీం మాత్రం వర్కింగ్ స్టిల్స్‌తో సరిపెట్టింది. అవి కూడా ఇప్పటివి కాదట..ప్రజంట్ డీజే షూటింగ్ జరగడం లేదట..అల్లు అర్జున్‌కు సర్జరీ జరగడం వల్లే సినిమా డీలే అవుతుందట..అయితే ఈ వార్తలను కవర్ చేయడానికే ఇలా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి సమ్మర్ రేస్ నుంచి డీజే తప్పుకున్నట్లు తెలుస్తోంది..మరి ఈ ఊహగానాలన్నింటికి డీజే టీం చెక్ పెడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



