మహేశ్ తమిళులతో పెట్టుకుంటాడా..? వెనక్కి తగ్గుతాడా..?
on Apr 3, 2017

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన క్రేజ్‌ను, మార్కెట్‌ను పెంచుకోవడంపై బాగా ఫోకస్ చేశాడు. దీనిలో భాగంగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్‌తో సినిమా చేస్తున్నాడు..దీనిని తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ స్టేజ్‌కు వచ్చినప్పటికి ఇంతవరకు టైటిల్ ఏంటనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు మహీ. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉందని ఫిలింనగర్ టాక్.
స్పై-డర్ అనే టైటిల్‌ను తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో రిజిస్టర్ చేయించారు నిర్మాతలు..అంతా బాగానే ఉంది కాని అసలు సమస్య తమిళనాడుతో వచ్చింది. అక్కడ టైటిల్ తమిళ భాషలో ఉంటేనే..సినిమాకి 100 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. కానీ స్పై-డర్ అనే టైటిల్‌కి తమిళ నిర్మాతలు ఒప్పుకునే అవకాశం ఉండదు..ఎందుకంటే ఇది నిర్మాతలను భారీగా నష్టపరిచే అంశం. కానీ మహేశ్ ఈ మూవీ టైటిల్ అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండాలని పట్టుబడుతున్నాడు. మరి నిర్మాతల కోసం సూపర్‌స్టార్ వెనక్కి తగ్గుతాడా..? లేక నిర్మాతలనే వెనక్కి తగ్గేలా చేస్తాడా అనేది వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



