గాళ్ ఫ్రెండ్స్ కోసం కోట్లు తగలేస్తున్న తెలుగు హీరో..!
on May 12, 2016

అతనో తెలుగు సినిమా హీరో.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. చేతిలో హిట్స్ ఉన్నాయి. సినిమాలు చేయడానికి నిర్మాతలూ ఉన్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయమైతే ఇక చెప్పక్కర్లెద్దు. తన పేరుమీద కోట్లు మూలుగుతున్నాయి. కాకపోతే ఇంకా పెళ్లికాలేదు. కానీ.. గాళ్ ఫ్రెండ్స్‌ని వెంటేసుకొని తిరగడంలో దిట్ట. కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటాడు. హీరోయిన్లను సైతం.. తన ప్రియురాళ్లుగా మార్చుకోవడంలో నేర్పరితనం ఉన్నవాడు. కొంతమంది హీరోయిన్లతో ఆ హీరో చాలా క్లోజ్‌గా ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే... డబ్బులు ఖర్చు పెట్టడంలోనూ మనోడు మహా దిట్ట అట.
ఈ మధ్య ఓ కథానాయికకి కారు కొనిపెట్టాడట. మరో కథానాయికకు ఫ్లాటు రాసిచ్చాడట. వీళ్లకే కాదు.. తనకు పరిచయమున్న అమ్మాయిలకు బహుమానాల రూపంలో ఏదో ఒకటి ఇస్తుంటాడట. ఈ విషయం ఇంట్లోవాళ్లకు తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని.. ప్రియురాళ్ల కోసం కోట్లు తగలేస్తున్నా చూస్తూ కుర్చుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఒకట్రెండు సార్లు తండ్రితో గొడవ పెట్టుకొన్నాడని, ప్రస్తుతం ఓ ఫ్లాట్‌లో తన ప్రియురాలితో కలసి ఉంటున్నాడని.. టాక్. తనయుడికి పెళ్లి చేస్తే లైన్‌లోకి వస్తాడని తల్లిదండ్రులు భావిస్తున్నారట. అయితే పెళ్లి విషయంలో వాళ్ల మాట వినడం లేదని, కొడుకు ఎప్పుడు ఏ కొంప ముంచుతాడో తెలియక వాళ్లు సతమతమవుతున్నారని టాక్. మరి ఆ హీరో ఎప్పుడు దార్లోకి వస్తాడో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



