చిరంజీవి గారూ..మళ్లీ వాయిదా వేశారా..?
on May 13, 2016

మెగా 150 సినిమా స్టార్ట్ అవడానికి చాలా కష్టపడుతోంది. ఇప్పటికే ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమాకు ముహూర్తం షాట్ తో ఇక అంతా సాఫీగా సాగిపోతుందనుకున్నారు. కానీ తాజాగా, సినిమా షూటింగ్ ను జూలై వరకూ వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. జూన్ లోనే సినిమా మొదలై, సంక్రాంతికి రిలీజ్ జరిగేలా మొదట మూవీ టీం అనుకున్నా, కథ కు సంబంధించిన వివాదాలు సినిమాను పట్టాలెక్కనివ్వకుండా అడ్డుపడుతున్నాయట. దీంతో పాటు, తన భుజానికి మరో సర్జరీ చేయించుకుని అంతా సెట్ అయిన తర్వాత సినిమాపైకి వెళ్లే ఆలోచనలో చిరంజీవి కూడా ఉన్నారట. అందుకే జూన్ లో మొదలవ్వాల్సిన రెగులర్ షూటింగ్ ను జూలైకు పోస్ట్ పోన్ చేసి, సినిమా స్క్రిప్ట్ ను కూడా మరింత టైట్ చేయించే పనిలో చిరు ఉన్నారట. ఇక సినిమాకు కాస్టింగ్ కూడా చాలా స్లోగా సాగుతోంది. హీరోయిన్ ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సినిమా స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ల ఆసక్తి కూడా సన్నగిల్లింది. సినిమా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉంది ఫ్యాన్స్ పరిస్థితి. రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అన్న పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మరీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనుకున్న డేట్ ప్రకారం సినిమా 2017 సంక్రాంతికి రావడమైతే కష్టమే మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



