హీరోయిన్ విషయంలో కొడుక్కి వార్నింగ్..!
on May 12, 2016

బాలీవుడ్ లో చాలా విచిత్రమైన గాసిప్స్ వస్తుంటాయి. అక్కడి జనాలకు ఏజ్ తో సంబంధం ఉండదు. ప్రేమ ఎవరితోనైనా ఎప్పుడైనా పుడుతుందని నమ్ముతారు. తాజాగా, బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ కు సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్, తన భార్య మలైకా అరోరా తో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయాడు. అయితే, విడిపోయిన తర్వాత మలైకా ఫ్లాట్ కు అర్జున్ కపూర్ రెగులర్ గా వచ్చి వెళ్తున్నాడట. బయట కూడా ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. దీంతో అర్బాజ్ తో మలైకా విడిపోవడానికి అర్జున్ కపూరే కారణమని, ఆమెతో కపూర్ వారబ్బాయి ఎఫైర్ నడుపుతున్నాడని వార్తలు వచ్చాయి. అసలే సల్మాన్ సోదరుడితో వ్యవహారం. నిజంగా ఎఫైర్ ఉందో లేదో తెలియక పోయినా, సల్మాన్ రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత ఘోరంగా తయారవుతాయనుకున్న బోనీ కపూర్, మలైకా కు దూరంగా ఉండమని కొడుక్కి స్ట్రాంగ్ ఆర్డర్ పాస్ చేశాడట. ఏమన్నా తేడా పాడాలొస్తే పట్టించుకోను, తర్వాత నీ ఇష్టం అని ఖచ్చితంగా చెప్పేయడంతో, మనోడు కూడా మలైకా ఫ్లాట్ కు వెళ్లడం తగ్గించేశాడట. మలైకాతో ఎఫైరా లేక ఫ్రెండ్ షిప్పేనా అన్నదానిపై కపూర్ బాబు మాత్రం నోరు విప్పకపోవడం కొసమెరుపు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



