మొదటి షోకి బన్నీ భయపడుతున్నాడా..?
on Jun 20, 2017

తెలుగునాట ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు..తమ అభిమాన హీరో సినిమాని అందరికంటే ఫస్ట్ చూడాలనే ఉద్దేశ్యంతో అర్థరాత్రి నుంచే నానా హంగామా చేస్తుంటారు అభిమానులు. టిక్కెట్ల కోసం ధియేటర్ల ముందు పడిగాపులు కాయడం..బ్యానర్లు, ఫ్లెక్సీలు అబ్బో పండగే పండగ. హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.
ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బన్నీ అభిమానులు బెనిఫిట్ షో చూడాలని ఆశపడ్డారు. కానీ అలాంటి వారికి షాకిచ్చాడు అల్లు అర్జున్. డీజేకి ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేశాడట. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ షోల కారణంగా నెగిటివ్ టాక్ వచ్చే ప్రమాదముందని, ఉదయం షో పడే టైమ్‌కీ యాంటీ ఫ్యాన్స్ దీనిని చెడుగా పబ్లిసిటీ చేసే అవకాశముందని..అదే జరిగితే ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని బన్నీ కాస్త భయపడుతున్నాడట..స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్‌కి, పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో సాహసాలు చేయకపోవడమే మంచిదని బన్నీ డిసైడ్ అయినట్లున్నాడు. ఏమైనా ఈ నిర్ణయంతో అర్జున్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



