డీజే... మైనస్ అదేనా..??
on Jun 19, 2017
అల్లు అర్జున్ బాక్సాఫీసుపై దండయాత్ర చేయబోతున్నాడు.. దువ్వాడ జగన్నాథమ్ గా! ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకటికి రెండు ట్రైలర్లు విడుదల చేయడం, అవి బన్నీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేయడం డీజే కి పాజిటీవ్ ఎనర్జీ అందించాయి. దువ్వాడ జగన్నాథమ్ గా అల్లు అర్జున్ గెటప్, తన బాడీ లాంగ్వేజ్, డైలాగులు ఈ సినిమాకి ప్లస్ కానున్నాయి. డాన్సులు సరే సరి. దేవిశ్రీ బాణీలూ మాస్ కి నచ్చేయడం ఖాయం. అయితే... డీజే సెన్సార్ అయ్యాక.. నెగిటీవ్ పాయింట్స కూడా బయటకు వచ్చాయి. డీజే కథ ఏమంత గొప్పగా లేదని, ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ బోర్ కొట్టడం ఖాయమని, క్లైమాక్స్ కూడా చిదేసిందని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. దాంతో.. డీజేపై డివైడ్ టాక మొదలైంది. సినిమా యావరేజ్‌గా వచ్చిందని, కాకపోతే... బాక్సాఫీసు దగ్గర మాత్రం నిలబడిపోతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
