టాలీవుడ్ తారలను అవమానించిన ఫిలింఫేర్
on Jun 20, 2017

నార్త్ ఫిలింఫేర్, సౌత్ ఫిలింఫేర్ ఏరియా ఏదైతే సినీ తారలు వీటికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికీ ఇవ్వరు. ఆఖరికి ప్రభుత్వం ప్రకటించే అవార్డులకి కూడా అంతగా విలువనివ్వరు. మరి ఇలాంటి ఈవెంట్‌లో పాల్గొవాలని ఏ సెలబ్రిటీకి ఉండదు చెప్పండి. అందుకే ఫిలింఫేర్ పాస్‌ల కోసం ఎగబడుతుంటారు తారలు. రీసెంట్‌గా ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి దక్షిణాదికి చెందిన నాలుగు పరిశ్రమల సెలబ్రిటీలు హాజరయ్యారు.
అయితే ఇంత మంది ముందు ఇద్దరు తెలుగు సెలబ్రిటీలకు అవమానం జరిగిందట. వాళ్లు ఎవరో కాదు నటుడు అడవి శేష్, హాట్ యాంకర్ అనసూయ. క్షణం చిత్రంలో నటించిన వీరిద్దరికీ ఫిలింఫేర్ కమిటీ ఆహ్వానమే పంపలేదట..దీనిపై అడవి శేష్ సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్విటేషన్ పంపలేదు కానీ సరిగ్గా ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి గంట ముందు క్షమాపణ చెప్పారు అని పోస్ట్ చేశాడు. ఇక అనసూయ పరిస్థితి మరీ ఘోరం..ఆమెకైతే సారీ కూడా చెప్పలేదట. ఇప్పుడు దీనిపై ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. వీరికే కాదట టాలీవుడ్‌కి చెందిన మరికొందరికి కూడా ఫిలింఫేర్ ఇన్విటేషన్లు పంపలేదట..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



