శర్వానంద్, అనుపమల మధ్య ఏదో జరుగుతోందా..?
on Feb 2, 2017

హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం.. ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించడం..ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం అబ్బో ఎన్ని చూడలేదు. ఇప్పటికే సమంత-నాగచైతన్య తమ ప్రేమను పండించుకొని త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా మరో జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందట. వారేవరో కాదు శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్. సంక్రాంతికి మంచి విందు భోజనం లాంటి శతమానం భవతితో సక్సెస్‌ని కొట్టారు శర్వానంద్, అనుపమ .
.jpg)
ఈ సినిమాలో అసలు సిసలు తెలుగింటి బావా మరదళ్లుగా ఆకట్టుకున్నారు వీరిద్దరూ. తెరపై అద్భుతమైన కెమిస్ట్రీ పండటంతో నిజంగా బావా మరదళ్లలానే అనిపించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొనడం..ఒకరి చెవులు ఒకరు కొరుక్కోవడంతో.. వీరిమధ్య ఏదో జరుగుతోందని ఫిలింనగర్ చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంభోలో ఇంకో సినిమా కనుక ఎనౌన్స్ అయ్యిందా ఈ వార్తకు మరింత బలం వచ్చినట్లే..కానీ ఇది పుకారా..? నిజమా అని తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



