చిరంజీవితో పవన్.. అసలు జరిగే పనేనా..?
on Feb 3, 2017

తెలుగు సినిమా మొత్తం షాక్‌కు గురేయ్యే ప్రకటన చేశారు కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి. అదేంటంటే తాను త్వరలో మళ్లీ సినిమా నిర్మాణం చేపడతానని..అది కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ అని..దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ న్యూస్ వెలువడిన దగ్గరి నుంచి మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి..అన్నదమ్ములు దీంతో కలిసిపోతారని..బాక్సాఫీస్ ఇక బద్దలేనని హాట్ హాట్ న్యూస్‌ని వండివర్చింది మీడియా. ఈ సంగతి పక్కనబెడితే ఫిలింనగర్‌లో ఈ కాంభినేషన్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చేస్తున్నాడు పవన్..అది పూర్తవ్వగానే తమిళ డైరెక్టర్ ఆర్‌టీ నీశన్‌తో..ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
ఇవన్నీ పూర్తవ్వాలంటే కనీసం రెండు సంవత్సరాలు సులభంగా పడతాయి..పోనీ పూర్తయ్యాయే అనుకుందాం..కానీ అప్పటికే సార్వత్రిక ఎన్నికల వేడి స్టార్ట్ అవుతుంది...అప్పటికి పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటాడు..ఇక సినిమా చేసే ఖాళీ ఎక్కడుంది. ఇక అన్నయ్య సంగతి చూస్తే..ఖైదీ నెం.150 బ్లాక్‌బస్టర్ కావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు మెగాస్టార్. ఇదే ఊపులో సురేందర్ రెడ్డి, బోయపాటిలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఆ రెండు సినిమాలు పట్టాలెక్కి..షూటింగ్ కంప్లీట్ అయ్యేనాటికి చిరుకి కూడా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుంటే మెగా మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదంటున్నారు సినీ జనాలు. మరీ కళాబంధు ఏం మేజిక్ చేస్తారో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



