రకుల్ పవన్‌నే కాదు అందా..?
on Feb 2, 2017

ప్రజంట్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం రకుల్ ప్రీత్ సింగ్. చేతి నిండా సినిమాలతో..ఈ ఏడాది తన డైరిలో ఖాళీ అన్న మాటే లేకుండా బిజీగా గడిపిస్తోంది. సీనియర్లు ఫేడవుట్ అవుతుండటంతో..కొత్త వారిలో స్టార్ హీరోలకి సెట్ అయ్యే వారు లేకపోవడంతో దర్శక నిర్మాతలు రకుల్ వెంట పడుతున్నారు. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, కోలీవుడ్ డైరెక్టర్ ఆర్‌టీ. నీశన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న మరో సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఈ బంపర్ ఆఫర్‌ని రకుల్ రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం మహేశ్-మురుగదాస్ మూవీతో పాటు నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీను సినిమాల్లో రకుల్ నటిస్తోంది. దీంతో పవన్ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేనని ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందట రకుల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



