ఒకే కారులో షికార్లు.. సమంత, రాజ్ డేటింగ్‌పై పెరిగిన పుకార్లు!
on Jul 31, 2025
ఏ హీరోయిన్ అయినా తరచూ ఒకే వ్యక్తితో కనిపిస్తుంటే.. వారి మధ్య ఏదో ఉందనే పుకారు షికారు చేయడం సహజమే. ముఖ్యంగా ఇలాంటివి బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ డేటింగ్ చేయడం, ఆ తర్వాత విడిపోవడం అనేది సర్వసాధారణం. ఈమధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. అది నిజమేనన్నట్టు వారి ప్రవర్తన కూడా ఉండడంతో సోషల్ మీడియాలో ఇదే హాట్ డిస్కషన్‌గా మారింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత.. కొంతకాలం అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. అంతకుముందు ది ఫ్యామిలీ మ్యాన్2లో కూడా కనిపించింది. ఈ రెండు వెబ్ సిరీస్‌లకు రాజ్, డి.కె. దర్శకులు.
ఆ వెబ్ సిరీస్‌ల తర్వాత సమంత, రాజ్ నిడిమోరు మధ్య బంధం బలపడిందనే రూమర్ వినిపించింది. అనేక మార్లు ఇద్దరూ కలిసి కనిపించడమే దానికి కారణం. ఇద్దరూ కలిసి హాలిడేకి వెళ్లడం, ఏదో ఒకచోట ఇద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరిలో ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగని పబ్లిక్‌గా కలిసి కనిపించడం కూడా మానలేదు. అంతేకాదు, తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో రాజ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తోంది సమంత. తాజాగా ముంబై వీధుల్లో సమంత, రాజ్ కలిసి ఒకే కారులో వెళ్తున్న దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. వారిద్దరూ ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి తిరిగి వస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగచైతన్యతో సమంత విడిపోయి నాలుగు సంవత్సరాలవుతోంది. ఇప్పుడు రాజ్‌తో డేటింగ్ చేస్తోందనే వార్త నిజమైతే త్వరలోనే వీరి బంధానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



