ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. దేవర-2 షూటింగ్ ఎప్పుడంటే..?
on Aug 3, 2025

జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఆగస్టు 14న బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇదే వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ ప్రాజెక్ట్ లు కూడా ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి. దీంతో అసలు 'దేవర-2' ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ 'దేవర-2' షూటింగ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'దేవర'. 2024 సెప్టెంబర్ లో విడుదలైన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, ఘన విజయం సాధించింది. అయితే కంటెంట్ పరంగా ఈ చిత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందని, కేవలంలో ఎన్టీఆర్ స్టార్డంతోనే ఆ స్థాయి వసూళ్లు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే 'దేవర-2' ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం 'దేవర-2' ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే షూట్ కి ముహూర్తం కూడా ఖారైనట్లు సమాచారం.
ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'డ్రాగన్' మూవీ షూటింగ్ ను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి.. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో 'దేవర-2'ను మొదలు పెట్టాలని ఎన్టీఆర్ చూస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో కొరటాల బిజీగా ఉన్నాడట. 'దేవర-2' స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, పార్ట్-1 తో పోలిస్తే పార్ట్-2 అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని.. అందుకే ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు.
మరోవైపు, నెల్సన్ ప్రస్తుతం రజినీకాంత్ తో 'జైలర్-2' చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో ఓ సినిమా కమిటై ఉన్నాడు. ఆ ఇద్దరు దర్శకులు తమ కమిట్మెంట్స్ పూర్తి చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడానికి టైం పడుతుంది. ఆ గ్యాప్ లో ఎన్టీఆర్ 'దేవర-2'ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



