SSMB29: మహేష్ బాబు ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!
on Jul 26, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. 'SSMB29' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'SSMB29' అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
రాజమౌళి తన గత సినిమాలకు భిన్నంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండానే 'SSMB29' షూట్ మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంతవరకు సినిమా నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రాలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో ఆరోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. గ్లింప్స్ విడుదల ఉంటుందని అభిమానులు భావించారు. అయితే మహేష్ బర్త్ డేకి ఎటువంటి అప్డేట్ ఉండదని తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ కి ఇంకా టైం తీసుకోబోతున్నారని సమాచారం. ఓ రకంగా ఇది ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. అయితే 'SSMB29' గ్లింప్స్ ఎప్పుడు విడుదలైనా.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయమని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



