సమంతకు కళ్లు కనిపిస్తాయట..
on Apr 12, 2017
.jpg)
ధృవ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథేంటి..చెర్రీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటూ అభిమానుల మనసుల్లో రకరకాల ప్రశ్నలు. అయితే ఇది ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని..ఇందులో రామ్‌చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడన్న టాక్ ఫిలింనగర్‌లో జోరుగా వినిపిస్తుంది. మరోవైపు కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సమంత చెర్రీతో జోడీ కడుతోంది.
హీరోలాగే ఆమెకు కూడా ఏదో ఒక లోపం ఉండాలని సుక్కు డిసైడయ్యాడట..ఇందుకోసం సమంతను అంధురాలిగా చేసేసాడని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. అయితే విషయం చిత్ర యూనిట్ దాకా వెళ్లడంతో అలాంటిదేమీ లేదంటూ వారు తేల్చేశారు. కథ ఇంత వరకు తమకే తెలియదని..అతి త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



