పెదనాన్న, బాబాయ్ మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు
on Apr 12, 2017

మెగా కుటుంబమంతా ఒక్కటే అని పైకి ఎంతగా కలరింగ్ ఇస్తున్నా..అనుకున్నంత సఖ్యత వారి మధ్య లేదని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మధ్య నానాటికి గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదట. ఒకరి సినిమా ఫంక్షన్లకు..మరొకరు రాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఈ విషయంపై స్పందించాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రీసెంట్‌గా జరిగిన మిస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మీడియా ఇదే ప్రశ్నను అడగటంతో వరుణ్ చాలా అసౌకర్యానికి గురయ్యాడట. అయినా మా కుటుంబంలో ఏం జరుగుతుందో బయటి వారికేం తెలుసు..ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది..ఓ కుటుంబ సభ్యుడిగా ఇలాంటి వార్తలు ప్రారంభంలో నన్ను చాలా బాధపెట్టేవి. మేమేంత బాగున్నాం అనే దానిపై ప్రజలకు పదే పదే వివరణ ఇవ్వాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాడు వరుణ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



