ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ వచ్చింది ఈ సినిమాలకే
on Apr 7, 2017

64వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ హిందీ చిత్రంగా సోనమ్ కపూర్ నటించిన నీర్జా దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లిచూపులు నిలిచింది. ఇదే సినిమాకు మాటలను అందించిన తరుణ్ భాస్కర్‌కు ఉత్తమ మాటల రచయిత అవార్డు దక్కింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్‌కు కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరానికి బెస్ట్ కొరియోగ్రఫర్ అవార్డు లభించింది.
జాతీయ చలన చిత్ర అవార్డులు
ఉత్తమ చిత్రం - కాసవ్ (మరాఠీ)
ఉత్తమ నటుడు - అక్షయ్ కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి - సురభి (మిన్నమినుంగు, మలయాళం)
ఉత్తమ దర్శకుడు - రాజేష్ (వెంటిలేటర్)
ఉత్తమ సహాయ నటి - జైరా వసీమ్ (దంగల్)
ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం - శివాయ్
ఉత్తమ సామాజిక చిత్రం - పింక్
ఉత్తమ గాయకుడు - సుందర అయ్యర్ (జోకర్, తమిళం)
ఉత్తమ గాయని - ఇమాన్ చక్రవర్తి (ప్రక్తాన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ - పీటర్ హెయిన్
ఉత్తమ బాలల చిత్రం - ధనక్ (నగేశ్ కుకునూర్)
తెలుగు సినిమాకు జాతీయ పురస్కారాలు
ఉత్తమ తెలుగు చిత్రం - పెళ్లి చూపులు
ఉత్తమ నృత్య దర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంభాషణలు - తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



