ఆ హీరోయిన్ అంటే క్రిష్‌కి స్పెషల్ కేర్..?
on Feb 1, 2017
హీరోయిన్లకు, దర్శకులకు మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక హీరోయిన్ ఫలానా దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేస్తే చాలు ఇంక వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ చర్చించుకుంటారు సినీ జనాలు. తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..డైరెక్టర్ క్రిష్ మాయలో పడిందని అంటున్నారు. వీరిద్దరూ గతంలో కంచె సినిమా కోసం పనిచేశారు. అప్పటి నుంచి ఈ బ్యూటీపై స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ.. వెన్నుదన్నుగా నిలుస్తున్నాడట క్రిష్.
అటు కెరిర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా..క్రిష్ నుంచి సలహా తీసుకున్నాకే అడుగు ముందుకు వేస్తోందట ప్రగ్యా. ప్రజంట్ మంచు మనోజ్ సరసన గుంటూరోడు, నాగార్జునతో ఓం నమో వెంకటేశాయ చేసింది ప్రగ్యా..తాజా టాక్ ప్రకారం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తర్వాత మూవీలో ప్రగ్యా హీరోయిన్గా కన్ఫార్మ్ అయ్యిందని ఫిలింనగర్ టాక్..మరీ వీరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయకతప్పదు..ఏదేమైనా నిప్పు లేనిదే పొగ రాదు కదా..?