తమ్ముడు వస్తున్నాడా!..పవన్ కళ్యాణ్ హెల్ప్ అవుతాడా!
on Apr 22, 2025
నితిన్(Nithiin)గత నెల మార్చి 28 న రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో నితిన్ కి భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల రాబిన్ హుడ్ కి దర్శకుడు కావడం, అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా బాక్స్ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో నితిన్ అప్ కమింగ్ మూవీ 'తమ్ముడు'(Thammudu)పైనే వాళ్ల ఆశలన్నీ ఉన్నాయి. ఇప్పటికే 'తమ్ముడు' టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)భారీ హిట్ ని అందుకొని ఉన్నాడు. 1999 జులై 15 న రిలీజైన ఈ మూవీ పవన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్ అయిన నితిన్ కూడా అదే టైటిల్ తో వస్తుండటంతో తమ్ముడి పై అందరిలోను పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దిల్ రాజు(Dil Raju)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కించి సక్సెస్ ని అందుకున్న వేణుశ్రీరామ్ (Venu Sriram)దర్శకుడు. నితిన్ సరసన సప్తమిగౌడ (Sapthami Gowda)హీరోయిన్ గా చేస్తుండగా సీనియర్ హీరోయిన్ లయ(Laya)కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ జులై 4 న థియేటర్స్ లోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్ ఆర్చరీ ఆటగాడిగా సందడి చేస్తుండగా అక్కా, తమ్ముడికి సంబంధించిన అనుబంధాల నేపథ్యంలో కథనాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే రిలీజైన నితిన్ లుక్ తో పాటు ప్రచార చిత్రం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాధ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
