ఎన్టీఆర్ 'డ్రాగన్'లో శృతి హాసన్..!
on Apr 24, 2025
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ భాగం కానుందని ప్రచారం జరుగుతోంది. (Dragon)
'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రత్యేక గీతం కోసం శృతి హాసన్ ని రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో.. సాంగ్స్ విషయంలో ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతాడు. పైగా మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే.. మంచి మాస్ సాంగ్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. ఆ అంచనాలకు తగ్గట్టుగా మంచి ఆల్బమ్ తో అలరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్ కూడా పెట్టాలని నిర్ణయించారట. అంతేకాదు, ఈ సాంగ్ లో శృతి హాసన్ చిందేయనుందని టాక్. నీల్ గత చిత్రం 'సలార్'లో శృతినే హీరోయిన్. ఆ సెంటిమెంట్ తో 'డ్రాగన్' కోసం ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
