నాని ఆ మూడు సినిమాలను కాపీ కొట్టాడా..?
on Jun 30, 2017
మనకు రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచే సినిమాకు కథ రెడీ చేయడం అంత సులభం కాదు. రచయిత ఒక బేస్ అనుకోని దానిని ఎనాలసిస్ చేస్తూ..ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రిప్ట్ తయారు చేస్తాడు..తీరా అంత కష్టపడి బయటకు తీసుకువస్తే..ఆ..ఈ పాయింట్ ఎన్ని సినిమాల్లో రాలేదు అంటూ సెటైర్లు..ఏ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చినా ఇదే ప్రశ్న ప్రేక్షకుల నుంచి వస్తుంది. అలాంటిది ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే అల్రెడి ఈ స్టోరీ మాకు తెలిసిందే అంటే..ఆ డైరెక్టర్, రైటర్ పరిస్ధితి ఏంటి..? ఇప్పుడు ఇలాంటి పరీక్షే హీరో నానికి ఎదురైంది.
నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ నిన్ను కోరి ప్రి రిలీజ్ ఫంక్షన్లో చిత్ర యూనిట్ థియెట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది. అది చూసిన యాంకర్ సుమ..నాకు ఈ సినిమాపై సందేహాలున్నాయంటూ కొన్ని పోస్టర్లు ప్లే చేసింది. ఎందుకంటే నాని ఒక పాటలో ఎవండోయ్ మాష్టారు..అది వెంకటేశ్ హిట్ మూవీ సుందరకాండ, ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు వాళ్ల మధ్య ప్రేమ అంటే అది ప్రేమదేశం..కారులో ప్రేమ అంటే టైటానిక్ షిప్లాంటిదని బడ్జెట్ లేక కారులో తీశారా అంటూ నాని మీద ప్రశ్నల వర్షం కురిపించింది. వాటికి ఉక్కిరిబిక్కిరైన నాచురల్ స్టార్ ఇవే కాదు మా సినిమాలో ఇంకా బోలెడన్ని వింతలు ఉన్నాయి అంటూ ఆన్సర్ ఇవ్వకుండా తప్పుకున్నాడు. మొత్తానికి సుమ చెప్పినట్లు ఇది మూడు సినిమాల కాపీయో కాదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.