మోహన్ బాబు కాంపౌండ్ లో తనికెళ్ల భరణి?
on Jun 30, 2017
.jpg)
సునీల్ హీరోగా ’భక్త కన్నప్ప‘ తీస్తానని రచయిత నటుడు తనికెళ్ల భరణి కొన్నాళ్ల క్రితం స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బౌండ్ స్ర్కిప్ట్ కూడా రెడీ చేసి షూటింగుకు కూడా రెడీ అయిపోయారాయన. అయితే... ఏమైందో ఏమో ఆ ప్రయత్నం అటకెక్కేసింది. కారణాలు పక్కన పెడితే ఇప్పుడు ఆ సినిమా మంచు వారి కాపౌండ్ కి చేరింది. అయితే... భరణి రాసుకున్న కథను మాత్రమే తీసుకొని డైలాగ్స్ మాత్రం వేరే వాళ్లతో రాయిస్తున్నట్లు తెలిసింది.
మంచువారి ఫ్యామిలీలో ఇప్పుడు రెడీగా ఇద్దరు యంగ్ హీరోలు ఉన్నారు. మరి వాళ్లలో ఎవరు ’కన్నప్ప‘గా కనిపించనున్నారో అనేది ప్రస్తుతం సస్పెన్స్. ఈ సినిమాకు మోహన్ బాబే దర్శకత్వం వహిస్తారని విశ్వసనీయ సమాచారం. మోహన్ బాబు కెరీర్ అసిస్టెంట్ డైరక్టర్ గానే మొదలైన విషయం తెలిసిందే. దాదాపు యాభై కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమాను తానే డైరెక్ట్ చేసి, తన గురువు దాసరికి అంకితం ఇవ్వనన్నారట మోహన్ బాబు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



