Home

»

Gossips

నాగచైతన్య 25వ సినిమా.. రాజమౌళి కాదు.. రంగంలోకి సుకుమార్! 

Feb 23, 2026

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నాగచైతన్య 25వ సినిమా
దర్శకుడు రాజమౌళి అంటూ మొదట ప్రచారం
సుకుమార్ కాంపౌండ్ అంటూ తెరపైకి కొత్త న్యూస్
అసలు చైతన్య 25వ సినిమా డైరెక్టర్ ఎవరు?

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తన 24వ సినిమా 'వృషకర్మ'ను కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్‌ గా రూపొందుతోన్న ఈ సినిమాతో చైతన్య ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య 25వ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హీరో కెరీర్ లో 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అందుకే చైతన్య 25వ సినిమాపై అక్కినేని కుటుంబం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) పేరు వినిపించింది. చైతన్య 25వ సినిమా దర్శకుడు రాజమౌళి అంటూ ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. నాగచైతన్య 25వ సినిమా సుకుమార్ కాంపౌండ్ లో తెరకెక్కునుందని తెలుస్తోంది.

చైతన్య 25వ చిత్రానికి సుకుమార్(Sukumar) కథ అందించడంతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. ఇక ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడట.

'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు(Buchi Babu Sana) మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తన రెండో సినిమా 'పెద్ది'(Peddi)ని ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది'పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. దీని తర్వాత ప్రతిష్టాత్మక నాగచైతన్య 25వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది.

కాగా, నాగ చైతన్య-సుకుమార్ కాంబినేషన్ లో గతంలో '100% లవ్' అనే విజయవంతమైన చిత్రం రావడం విశేషం. ఆ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయగా, ఇప్పుడు 25వ సినిమాకి కథ అందిస్తున్నాడని టాక్. మరి చైతన్య 25వ సినిమా కోసం సుకుమార్ ఎలాంటి కథను ఇస్తాడో చూడాలి.

ఇదిలా ఉంటే, నాగచైతన్యతో సినిమా చేయబోయే దర్శకుల లిస్టులో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, వెంకీ అట్లూరి, క్లాక్స్‌ వంటి దర్శకుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. 

Also Read: ఉదయ్‌పూర్ బయల్దేరిన విజయ్, రష్మిక

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com