
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్
- రంగంలోకి వివిధ భాషలకు చెందిన స్టార్స్
- ప్రత్యేక పాత్రలో అక్కినేని హీరో!
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.
ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ కావడంతో 'డ్రాగన్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను పెంచే న్యూస్ వినిపిస్తోంది. ఇందులో అక్కినేని హీరో అఖిల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Akhil Akkineni)

'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టోవినో థామస్ విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. అలాగే 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కథకు కీలకమైన ప్రత్యేక పాత్రలో అఖిల్ కనిపించనున్నాడట. నిడివి తక్కువ అయినప్పటికీ ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.
ఎన్టీఆర్, అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ రోల్ అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా అఖిల్ ఓకే చెప్పినట్లు టాక్.
కాగా, అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, జూన్ కి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి.
Also Read: 24 ఏళ్ళ క్రితం బండ్ల గణేష్ హీరోగా భారీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?







